అల్లు అర్జున్ 'పుష్పా'లో నేను నటించడం లేదు...

అల్లు అర్జున్ 'పుష్పా'లో నేను  నటించడం లేదు...

అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పక్ నారాయణగా నటిస్తున్నట్లు సమాచారం.. గంధపు చెక్కల స్మగ్లింగ్ ఈ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమా నుంచి తమిళ హీరో విజయ సేతుపతి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే... కాగా ఇటీవల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్‌ సేతుపతి ప్రకటించారు. దాంతో విజయ్ సేతు పతి పాత్ర కోసం వేట మొదలు పెట్టింది చిత్రయూనిట్ ఈ క్రమంలో రంగస్థలం లో నటించిన ఆది పినిశెట్టిని ఎంపిక చేసారని వార్తలు వచ్చాయి. పుష్ప చిత్రంలో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొన్నాడు. పుష్ప చిత్రం కోసం తనను సుకుమార్ గారు సంప్రదించలేదని సన్నిహితుల వద్ద ఆది చెప్పాడట. గతంలో బోయపాటి శ్రీను సరైనోడు చిత్రంలో నటించిన ఆది ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు.