మీ నాన్న వల్లే ఆ సూపర్ హిట్ సినిమా వదులుకున్నా

మీ నాన్న వల్లే ఆ సూపర్ హిట్ సినిమా వదులుకున్నా

బాలీవుడ్‌లో బంధుప్రీతి  ఉందని, వారసులకు ఇచ్చినంత విలువ బయటినుంచి వచ్చినవాళ్లకు ఇవ్వరని ఎప్పటినుంచో ఓ వివాదం సాగుతోంది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఈ వివాదం ఊపందుకుంది. నెపోటిజం టాపిక్‌ వచ్చిన ప్రతిసారీ నేనున్నానంటూ ముందువరసలో నిలబడి పోరాటం చేస్తున్నారు కంగనా.ఇదిలా ఉంటే ఇటీవల  పూజా భట్‌ ఒక వీడియో పోస్ట్‌ చేసి ఆమెకు మొదటి ఆఫర్‌ ఇచ్చిన మా నాన్న గారిని విమర్శించడం కంగనా విజ్ఞతకే వదిలేస్తున్నాను అంది. అంతే  కాకుండా  మొదటి సినిమాకు అవార్డు అందుకున్న సమయంలో మానాన్న మహేష్ భట్ ను స్టేజ్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో పాటు హగ్ కూడా చేసుకుంది అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. అప్పుడు ప్రశంసలు కురిపించి ఇప్పుడు విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అన్నట్లుగా పూజా భట్ సీరియస్ అయ్యింది. ఈ వీడియోపై కంగన స్పందిస్తూ.. `మీ నాన్న అవకాశం ఇవ్వడం వల్ల నాకు పెద్ద నష్టమే జరిగింది. ఆ సమయంలోనే నాకు తెలుగులో మహేశ్‌బాబు `పోకిరి` సినిమాలో అవకాశం వచ్చింది. మీ `గ్యాంగ్‌స్టర్‌` వల్ల `పోకిరి`లాంటి మంచి సినిమాను వదులుకున్నాన`ని కంగన తెలిపింది.