హైదరాబాద్ లో 112 ఏళ్ల నాటి ఘటనను గుర్తు చేసిన రంజాన్ వేడుకలు...!

 హైదరాబాద్ లో 112 ఏళ్ల నాటి ఘటనను గుర్తు చేసిన రంజాన్ వేడుకలు...!ముస్లీలకు పవిత్రమైన రంజాన్ వేడుకలు హైదరాబాద్ లో ఎప్పుడు ఎంతో ఆడంబరంగా జరుగుతాయి. పవిత్రంగా భావించే ఈ రంజాన్ వేడుకలు ఈసారి సాధాసీదాగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా మసీదులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అంతా ఇళ్లలనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఎప్పుడూ రద్దీగా, సామూహిక ప్రార్థనలు జరిగే రంజాన్ పండగ ఇలా జరగడం 112 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితులు 112 ఏళ్ల క్రితం నాటి సంఘటనను గుర్తు చేస్తున్నాయని అప్పటి విషయాలను నెమరవేసుకున్నారు. అప్పట్లో హైదరాబాద్‌లో మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లన్ని బురదమయంగా మారడంతో మసీదులకు ఎవరూ వెళ్లలేకపోయారు.దీంతో ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి ఎలాంటి ఆర్భాటం లేకుండా పండగ జరుపుకున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా అలాంటి పరిస్థితే వచ్చిందని చెబుతున్నారు. దీంతో రంజాన్ మాసంలో ఎప్పుడూ కళకళలాడే నగరం ఇప్పుడు కళ తప్పింది. చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాలు అన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.