తెలంగాణలో మరికొన్ని లాక్ డౌన్ సడలింపులు..జీహెచ్ఎంసీ పరిధిలో కూడా...?

తెలంగాణలో మరికొన్ని లాక్ డౌన్ సడలింపులు..జీహెచ్ఎంసీ పరిధిలో కూడా...?

తెలంగాణలో మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కరోనాతో సహజీవనం తప్పదని నిర్ణయించుకున్న తెలంగాణ సర్కార్ అందుకు అనుగుణంగా సడలింపులు చేయాలని నిర్ణయించుకుంది. కాకపోతే స్వీయనియంత్రణ చర్యలు పాటించేలా మాత్రం కొన్ని సూచనలు ఇవ్వనుంది. రెడ్ జోన్లలో కూడా కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల లాక్ డౌన్ సడలింపుల దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం రెడ్‌జోన్లలో నిత్యావసర సరుకుల దుకాణాలు కాకుండా, మద్యం దుకాణాలు, వ్యవసాయ, నిర్మాణ రంగ సంబంధిత దుకాణాలు తెరవడానికే అనుమతి ఇచ్చారు.

ఇక రెడ్ జోన్ పరిథిలో ఉన్న జీహెచ్ఎంసీ దాదాపు 35 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉండటంతో జీహెచ్ఎంసీలో కూడా కేసులు నమోదవ్వని చోట కొన్ని సడలింపులు ఇవ్వనుంది. ఈ ప్రాంతాల్లో ఎలాంటి షాపులు ఓపెన్ చెయ్యాలి అన్నది నిర్ణయించాల్సి ఉంది. ప్రజా రావాణ పై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పుడే మాత్రం ఎక్కువరద్దీ ఉండే నగరంలోని సిటీ బస్సులకు అనుమతిచ్చే ఆవకాశం లేదు. ఎలాంటి సడలింపులివ్వాలన్నది ఈ రోజు సీఎం కేసీఆర్ జరిపే రివ్యూలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.