వివరాలు వెల్లడిస్తే.. ఐదుకోట్ల బహుమతి

వివరాలు వెల్లడిస్తే.. ఐదుకోట్ల బహుమతి

దేశంలో బినామీ, నల్లధనం కలిగిన బడా వ్యక్తులను పట్టుకునేందుకు కేంద్రప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది.  కానీ, వీలు కావడం లేదు.  బినామీ ఆస్తులు కలిగిన వ్యక్తుల వివరాలను వెలువరించే వారి వివరాలను బయటపెడితే.. వారికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి నజరానా ఇస్తూ ఉండేది.  ఇప్పటి వరకు ఈ మొత్తం తక్కువగా ఉండేది.  కానీ, ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  ఈ బహుమతి పొందాలంటే.. పౌరులు నల్లధనం చట్టం 2015 పరిధిలోని నల్లధనం, బినామీ ఆస్తుల వివరాలను ప్రకటించాల్సి ఉంటుంది.  ఇక 2007 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆస్తుల వివరాల సమాచారం అందించిన వ్యక్తులకు.. గుర్తించిన ఆస్తుల్లో పన్ను చెల్లించదగిన మొత్తంలో 5%, పూర్తి స్థాయిలో పన్నులు వసూలయ్యాక 15% శాతం రివార్డు అందించేవారు.  ఆదాయపు పన్ను కోటి దాటితే పన్ను మొత్తంలో 50 లక్షలు ఇచ్చేవారు.  కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని 5 కోట్లకు పెంచారట.