952 పోస్టులు మంజూరు...

952 పోస్టులు మంజూరు...

సూర్యాపేట మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి 952 పోస్టులు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పోస్టులను వైద్యఆరోగ్యశాఖ ద్వారా నేరుగా నియామకాలను చేపట్టనున్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ శాఖల్లో వరుసగా నియామకాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోతో మరోసారి నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది.