ఆ మ్యాచ్‌కు 9 మంది క్రికెటర్లు డుమ్మా!

ఆ మ్యాచ్‌కు 9 మంది క్రికెటర్లు డుమ్మా!

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 9 మంది భారత క్రికెటర్లు అప్ఘానిస్థాన్‌తో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌కు దూరంకానున్నారు. జూన్‌ 14న బెంగళూరు వేదికగా అప్ఘానిస్థాన్‌ తమ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. సర్రే తరఫున కౌంటీ క్రికెట్‌ ఆడనున్న నేపథ్యంలో కెప్టెన్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమవుతున్నాడు. ఇషాంత్‌, ఛటేశ్వర్‌ పూజరా ఇప్పటికే ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్నందున అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. అశ్విన్‌ కూడా కౌంటీల్లో ఆడేందుకు ఐపీఎల్‌ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌ పయనమవుతాడు. వీరు నలుగురితోపాటు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, అజింక్య రహానే, మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు అప్ఘాన్‌తో మ్యాచ్‌లో బరిలో దిగరని సమాచారం. ఇంగ్లాండ్‌లో ఈసారి ఎలాగైనా టెస్టు సిరీస్ నెగ్గాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు వీరంతా 'ఇండియా-ఏ' టీంతో ముందుగానే అక్కడికి బయల్దేరి వెళ్తారని తెలుస్తోంది. అప్ఘానిస్థాన్‌తో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లో పాల్గొనే జట్టును ఈనెల 8న ఎంపిక చేస్తారు.