ఏపీ లో భారీగా నమోదైన కరోనా కేసులు... పశ్చిమ గోదావరిలో ఒక్కరోజులోనే...

ఏపీ లో భారీగా నమోదైన కరోనా కేసులు... పశ్చిమ గోదావరిలో ఒక్కరోజులోనే...

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.  రోజు రోజుకు కరోనా తీవ్రరూపం దాల్చుతున్నది.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ఇప్పటికే ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఏపీలో 793 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,891కి చేరింది.  గత 24 గంటల్లో 11 మంది కరోనాతో మరణించారు.  దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 180కి చేరింది.  

నమోదైన మొత్తం కేసుల్లో 7479 కేసులు యాక్టివ్ గా ఉండగా, 6232 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 793 కేసుల్లో 706 కేసులు ఏపీకి చెందినవికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 81 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన 6 మందికి కరోనా సోకింది.  ఇక జిల్లాల వారీగా చూసుకుంటే, గడిచిన 24 గంటల్లో అనంతపూర్ లో 96, చిత్తూర్ లో 56, తూర్పు గోదావరిలో 72, గుంటూరులో 98, కడపలో 71, కృష్ణా జిల్లాలో 52, కర్నూల్ జిల్లాలో 86, నెల్లూరు జిల్లాలో 24, ప్రకాశం జిల్లాలో 26, విశాఖపట్నంలో 11,  విజయనగరంలో 1, పశ్చిమగోదావరి జిల్లాలో 113 కొత్త కేసులు నమోదయ్యాయి.  పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరోజులో వందకు పైగా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి.