మరో 64మంది బలి... ఒంటరవుతున్న చైనా...!!

మరో 64మంది బలి... ఒంటరవుతున్న చైనా...!!

వుహాన్ లో పుట్టిన మహమ్మారి వైరస్ ప్రపంచం మొత్తం క్రమంగా వ్యాపిస్తోంది.  ఇప్పటికే చైనాలోని దాదాపుగా అన్ని ప్రాంతాలకు వ్యాపించింది.  ఈ వైరస్ బారిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఈ వైరస్ వలన చైనాలో మొదట రోజు 10 నుంచి 20 మంది మరణించేవారు.  కానీ ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో షాక్ అవుతున్నారు.  

మొన్నటి రోజున 58 మందిని పొట్టిన పెట్టుకున్న కరోనా నిన్నటి రోజున ఏకంగా 64 మందిని బలితీసుకుంది. ఈరోజు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.  రోజు రోజుకు తీవ్రం అవుతుండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అవుతున్నాయి.  ఈ కరోనా వైరస్ కు తగిన మెడిసిన్ ను తయారు చేసే పనిలో అన్ని దేశాలు నిమగ్నమయ్యాయి.  ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.