ఏపిలో భారీగా పెరిగిన కేసులు...  24 గంటల్లో... 

ఏపిలో భారీగా పెరిగిన కేసులు...  24 గంటల్లో... 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి.  గత 24గంటల్లో 62 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 2514కి చేరింది.  ఇందులో 1731 మంది డిశ్చార్జ్ కాగా, 55 మంది మరణించారు.  728 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో 51 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, కోవిడ్ వలన కృష్ణా జిల్లాలో ఒకరు మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది.  రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న వలస కార్మికులపై దృష్టి పెట్టింది.  అలానే పక్క రాష్ట్రం తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ కు వెళ్లొచ్చిన రైతులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.  వలస కూలీలు, కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన వారినుంచి ప్రసుత్తం కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.