రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని కన్షౌజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం కొందరు విద్యార్థులు ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు దాటుతుండగా.. విద్యార్థులపైకి ఓ ప్రైవేట్ బస్సు దూసుకెల్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉంది. కన్హౌజ్ ప్రమాద బాధిత కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Photo: Fileshot