కరోనా భయం : ఆరుగురు వైద్యుల రాజీనామా..మళ్ళీ వెనక్కి ! 

కరోనా భయం : ఆరుగురు వైద్యుల రాజీనామా..మళ్ళీ వెనక్కి ! 

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. వేల మందిని ఆస్పత్రుల్లో చేరేలా చేసింది. అలాంటి వైరస్ బాధితులకు వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు వైద్యులు. తమ ప్రాణాలకు తెగించి కరోనా బాధితులను కాపాడుతూ కొంత మంది వైద్యులైతే తమ విధుల్లోనే ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్యుల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న ఆరుగురు వైద్యులు రాజీనామా చేశారు. ఆస్పత్రికి రోగులు పెరగటంతో కరోనా వస్తుందన్న భయంతో వైద్యులు రాజీనామా చేశారు.

ప్రైవేట్ ఆస్పత్రులు మూతపడి ఉండటంతో జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. అయితే కలెక్టర్, డీఎంహెచ్వో, సూపరింటెండెంట్ రాజీనామా చేసిన వైద్యులతో చర్చించారు. ఇలాంటి విపత్కర సమయంలో రాజీనామా సరికాదని సూచించారు. దీంతో వైద్యులు తమ రాజీనామా ఉపసంహరించుకుని విధులకు హాజరువుతున్నారు. అయితే ఓపి సేవల్లో సామాజిక దూరం పాటించే విధంగా చూడాలని వైద్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి  హామీ ఇచ్చారు. ఇక వైద్యులపై,  సిబ్బందిపై దాడులు చే్స్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు.