ఏపీలో అదేజోరు.. 2 వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు..

ఏపీలో అదేజోరు.. 2 వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు..

ఏపీలో కరోనా జోరు కొనసాగుతూనే ఉంది... కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తున్నా.. ఇవాళ కూడా భారీగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా తాజా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య 1980కి చేరింది... 925 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 1010మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇవాళ అత్యధిక కేసులో చిత్తూరు జిల్లాలో నమోదు అయ్యాయి... 24 గంటల్లో చిత్తూరులో 16 కేసులు, కర్నూలులో 13, గుంటూరులో 6, అనంతపురం, నెల్లూరులో ఐదు చొప్పున కేసులు నమోదు కాగా... ప్రకాశం జిల్లాలో రెండు, కడప, విశాఖపట్నం, కృష్ణాజిల్లాల్లో ఒక్కోకేసు నమోదు అయ్యాయి... 8666 సాంపిల్స్ పరీక్షంచగా.. 50 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక, కర్నూలులో జిల్లాలో ఒకరు మృతిచెందడంతో.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతిచెందినవారి సంఖ్య 45కి చేరింది. ఇప్పటివరకు 566 కేసులతో కర్నూలు టాప్‌ స్పాట్‌లో ఉండగా.. గుంటూరులో 382, కృష్నా జిల్లాల్లో 339, చిత్తూరులో 112, అనంతపురంలో 107, నెల్లూరులో 101 కేసులు నమోదు అయ్యాయి. అయితే, టెస్ట్‌ల సంఖ్య పెరుగుతున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గిందనే చెప్పుకోవాలి.