ప్రపంచంలో సగం జనాభా లాక్ డౌన్...!!

ప్రపంచంలో సగం జనాభా లాక్ డౌన్...!!

కరోనా... ఈ వైరస్ పై ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తున్నది.  ప్రపంచ యుద్దాలు ఎలా ఉంటాయో తెలియదుగాని, దానికంటే కరోనాపై యుద్ధం చేయడం చాలా కష్టంగా ఉన్నది.  కరోనాపై యుద్ధం చేసి గెలవాలి అంటే మాములు విషయం కాదు.  చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. మాములు యుద్ధాల్లో గెలవాలి అంటే అడుగు ముందుకు వేయాలి.  కానీ, ఈ యుద్ధంలో గెలవాలి అంటే అడుగు వేయకుండా ఉన్నచోటే ఆగిపోవాలి. అప్పుడే కరోనాపై యుద్ధంలో గెలవగలం.  

కరోనా వైరస్ ప్రపంచంలోని 194 దేశాలకు పాకింది.  ఈ వైరస్ అడుగుపెట్టని దేశం లేదంటే నమ్మశక్యం కాదు.  అన్ని దేశాలకు వ్యాపించిన కొన్ని దేశాల్లోనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్నది.  ప్రభావం అధికంగా ఉన్న దేశాలను లాక్ డౌన్ చేశారు.  ఈ బాటలోనే మరిన్ని దేశాలు కూడా అడుగువేయబోతున్నాయి.  ప్రపంచంలో దాదాపుగా 700 కోట్ల మంది వరకు జనాభా ఉన్నారు.  ఇందులో సగం జనాభా ఇప్పుడు లాక్ డౌన్ లో ఉన్నది అంటే అర్ధం చేసుకోవచ్చు వైరస్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నదో.