ఒక్క సిగరెట్ ముగ్గురికి కరోనా పాజిటివ్...!

 ఒక్క సిగరెట్ ముగ్గురికి కరోనా పాజిటివ్...!

ఒక్క సిగరెట్ తో ముగ్గురికి కరోనా సోకింది. ఒకరి తర్వాత ఒకరు షేరింగ్ చేసుకోవడంతో ఒకరి తరువాత ఒకరికి ముగ్గురికి వైరస్ సోకింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ యువకుడు హైదరాబాద్ జియగూడాలో కరోనా పాజిటివ్ వచ్చినా వారి అంత్యక్రియలకు వెళ్లి వచ్చాడు.  షాద్ నగర్ వచ్చి తన ఫ్రెండ్స్ తో కలిసి సిగరెట్ తాగాడు.  ఒకే సిగరెట్ ముగ్గురు షేరింగ్ చేసుకోవడంతో ఒకరి తరువాత ఒకరికి ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు . దాంతో పాటు షాద్ నగర్ నుండి హైదరాబాద్ జియా గూడ వరకూ  కారులో వెళ్లడంపై అధికారుల నిర్లక్ష్యం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికే షాద్ నగర్ లో కరోనా కేసులు 7కు చేరుకున్నాయి..