ఒకే కుటుంబం.. అందరూ డాక్టర్లే

ఒకే కుటుంబం.. అందరూ డాక్టర్లే

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై కర్ణాటకకు చెందిన మహీంద్రా వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందని వారని.. అందరూ డాక్టర్లని సమాచారం.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.