రికార్డ్ స్థాయిలో ఇండియాలో కరోనా కేసులు...  ఒక్కరోజులోనే... 

రికార్డ్ స్థాయిలో ఇండియాలో కరోనా కేసులు...  ఒక్కరోజులోనే... 

ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.  గత మూడు రోజులుగా కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి.  ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.  దీంతో ఇండియాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 8,49,553కి చేరింది.  ఇందులో 2,92,528 కేసులు యాక్టివ్ గా ఉంటె, 5,34,620 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.  ఇక గడిచిన 24 గంటల్లో 551 కరోనా మరణాలు సంభవించాయి.  దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,674కి చేరింది.  24 గంటల్లో ఇండియాలో 2,80,151 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ పేర్కొన్నది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 1,15,87,153 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.