అనంతపురం జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ... బయటకు వస్తే... 

అనంతపురం జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ... బయటకు వస్తే... 

రాయలసీమలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  అనంతపురం జిలాల్లో ఈరోజు 1128 కేసులు నమోదయ్యాయి.  ఇప్పటి వరకు జిల్లాలో 15827 కేసులు నమోదవడంతో... అధికారులు అప్రమతం అయ్యారు.  కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఆదివారం రోజున జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల కర్ఫ్యూ ఉంటుందని, కర్ఫ్యూ సమయంలో ఎవరూ కూడా రోడ్డు మీదకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.  అత్యవసరస సేవలు మినహా వాణిజ్య, వ్యాపార సంస్థలు మూసెయ్యాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.