కరోనాను కంట్రోల్ చేసేందుకు ఆ జిల్లాలో ఏం చేయబోతున్నారంటే... 

కరోనాను కంట్రోల్ చేసేందుకు ఆ జిల్లాలో ఏం చేయబోతున్నారంటే... 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరుగుతున్నాయి తప్పించి తగ్గడం లేదు.  ఉభయగోదావరి జిల్లాల్లో కేసులు సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు.  

ఆదివారం రోజున ప్రజలు ఎక్కువగా బయటకు వస్తుంటారు.  ఇక నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతుంటాయి.  అక్కడి నుంచి కరోనా వేగంగా విస్తరించే అవకాశం ఉంటుంది. కరోనా కంట్రోల్ చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  ఇకపై ప్రతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది.  ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు జరుగుతుంది.  కర్ఫ్యూ అమలులో ఉండే 24 గంటలు ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకూడదు.  మెడికల్ షాపులు మినహా మొత్తం క్లోజ్ చేసి ఉంటాయి.