202 రంగులున్న చేనేత చీర రెడీ

202 రంగులున్న చేనేత చీర రెడీ

సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ మరో రికార్డు సృష్టించాడు. 202 రంగులు గల కాటన్, పాలిస్టర్ చీరను మరమగ్గంపై నేసి మరోసారి అద్భుతాన్ని సృష్టించాడు. 
 5 మీటర్ల పొడవు, 48 ఇంచల వెడల్పు 400 గ్రాముల బరువుతో ఈ చీరను నేసి అందరి అభినందనలు అందుకున్నారు. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త వినియ్ ఆర్డర్ పై ఈ చీరను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ చీరను నేయడానికి 15రోజులు సమయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.