2.25 లక్షల షెల్‌ కంపెనీలకు నోటీసులు?

2.25 లక్షల షెల్‌ కంపెనీలకు నోటీసులు?

కేవలం కాగితంపైనే కంపెనీలు నడుపుతూ మనీలాండరింగ్‌, అక్రమ లావాదేవీలు జరిపే సంస్థలపై కేంద్రం దృష్టిసారించింది. ఆర్థిక పరిభాషలో డొల్ల (షెల్‌) కంపెనీలుగా పేర్కొనే ఈ బోగస్‌ సంస్థల లిస్టు కేంద్ర కార్పరోట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించినట్టు తెలిసింది. 2013-14లో దాదాపు 3 లక్షల షెల్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం ఈసారి 2.25 లక్షల సంస్థలపై గురిపెట్టింది. ఆదాయపన్ను రిటర్నులు సమర్పించని కంపెనీలకు నోటీసులు జారీ చేయాలని, అప్పటకీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని భావిస్తోంది. దాదాపు 2.26 లక్షల కంపెనీల్లో 1.68 లక్షల సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు లభించాయని, వాటిలో 73,000 కంపెనీలు పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2.40 లక్షల కోట్ల మేరకు డిపాజిట్‌ చేశాయని అధికార వర్గాలు తెలిపాయి.