ఒక్కరోజులోనే 1900 మరణాలు... అయోమయంలో అమెరికా... 

ఒక్కరోజులోనే 1900 మరణాలు... అయోమయంలో అమెరికా... 

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది.  ఇప్పటి వరకు అమెరికాలో వేలాది మరణాలు సంభవించాయి.  మొత్తం మొత్తం అమెరికాలో ఇప్పటి వరకు 4,00,540 కరోనా కేసులు నమోదు కాగా, 12,857 మరణాలు సంభవించాయి.  రోజు రోజుకు కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతున్నది.  వెంటిలేటర్ల కొరత, ఇతర వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నది.  

మెడిసిన్స్ కొరత కూడా ఆ దేశాన్ని బాధిస్తోంది.  మానవతా దృక్పధంతో ఇండియా మెడిసిన్స్ సప్లై పై ఆంక్షలను పాక్షికంగా సడలించి హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ తో పాటుగా ఇతర కొన్ని మెడిసిన్స్ ను పంపేందుకు అంగీకరించింది.  ఇక ఇదిలా ఉంటె మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 1900 మరణాలు సంభవించాయి.  ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లో ఇదే ఎక్కువ అని చెప్పాలి.  రోజుకు వెయ్యికి పైగా కరోనా మరణాలు సంభవిస్తుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.  ఎక్కువ మరణాలు న్యూయార్క్ నగరంలోనే సంభవిస్తున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు పెద్దగా బాగాలేనప్పటికీ గతంలో చెప్పిన విధంగా మరణాలు సంభవించే అవకాశం ఉండకపోవచ్చని  అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం విశేషం.