భారీ పేలుడులో 16మంది మృతి

భారీ పేలుడులో 16మంది మృతి

ఇరాక్‌లో భారీ పేలుడు సంభవించడంతో 16మంది మృతి చెందారు. ఇరాక్‌లోని సదర్‌ సిటీకి సమీపంలో ఉన్న ఆయుధ బండాగారంలో బుధవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16మంది మృతి చెందగా.. సుమారు 90 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి  తరలించారు అధికారులు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటన మసీదు సమీపంలో జరిగినట్లు సమాచారం. పేలుడు జరిగిన ప్రాంతంలోని ఇళ్లు, భవనాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయుధ బండాగారంలోని సామాగ్రిని ట్రక్కులో  మరో చోటుకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని సమాచారం. 

Photo: FileShot