ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైపూర్ నుండి ఉత్తర ప్రదేశ్ కు కొంతమంది ప్రయాణికులతో ఓ ప్రయివేట్‌ బస్సు బయలుదేరింది. ఇటవా-మెయిన్‌పూర్‌ జాతీయ రహదారిపై కిరాత్‌పుర్ గ్రామానికి చేరువలో ఉదయం 5 గంటల సమయంలో.. బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. 35 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప సఫాయ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.