తెలంగాణ‌లో మ‌ళ్లీ భారీగా క‌రోనా కేసులు... 41 వేలు దాటిన కేసులు

తెలంగాణ‌లో మ‌ళ్లీ భారీగా క‌రోనా కేసులు... 41 వేలు దాటిన కేసులు

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క‌ల్లోలం సృష్టిస్తూనే ఉన్నాయి.. మొత్తం కేసులు 41 వేలు దాటాయంటే.. ఎంత వేగంగా కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయే అర్థం చేసుకోవ‌చ్చు.. ఇక‌, తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,676 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇదే స‌మ‌యంలో మ‌రో 10 మంది క‌రోనా రోగులు మృతిచెందారు.. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 41,018కు చేరుకోగా.. మృతుల సంఖ్య 396కి పెరిగింది.. అంటే.. క‌రోనా పాజిటివ్ కేసులు 40 వేల మార్క్‌ను క్రాస్ చేయ‌గా.. మృతుల సంఖ్య 400కు చేరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,081 బెడ్స్ ఉండ‌గా..  ప్ర‌స్తుతం 1,692 మంది రోగులు ఆస్ప‌త్రుల్లో ఉన్నారు.. మ‌రో 15,389 బెడ్లు ఖాళీగా ఉన్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం.. ఇక‌, హైద‌రాబాద్‌లో క‌రోనా కేసుల తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉంది.. తాజాగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 788 కేసులు న‌మోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 224, మేడ్చ‌ల్‌లో 160, క‌రీంన‌గ‌ర్‌లో 92,  న‌ల్గొ్ండ‌లో 64, సంగారెడ్డిలో 57, వ‌న‌ప‌ర్తిలో 51 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.