పోలీసులకు మస్కా కొట్టి .. 150 మంది సమక్షంలో నిశ్చితార్థం కానీ...

పోలీసులకు మస్కా కొట్టి .. 150 మంది సమక్షంలో నిశ్చితార్థం కానీ...

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటిస్తున్న విష‌యం తెలిసిందే.  అయితే పెళ్లిళ్లు, చావుల‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ‌ స్ప‌ష్టం చేసాయి. తెలంగాణాలో   పెళ్లి వేడుక‌ల‌కు 20 మంది, అంత్య‌క్రియ‌ల వ‌ద్ద 10 మంది క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో జ‌నం ఉండ‌రాదు అని కేసీఆర్ స్పష్టం చేసారు.కానీ  అధికారుల కళ్లు గప్పి గుట్టుచప్పుడు కాకుండా 150 మంది బంధువుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్నాడు ఓ ఘనుడు. ఈ నెల 11న నిశ్చితార్థం నిర్వహించగా.. 2 రోజుల తరువాత వరుడి తమ్ముడు అనారోగ్యానికి గురయ్యాడు.తీరా పరీక్షించగా అతడికి కరోనా అని తేలింది. దీంతో ఇంట్లోని 23 మందిని ‌ ఆస్పత్రికి తరలించారు.వీరిలో 15 మందికి కరోనా ఉన్నట్లు 17న నిర్ధారణ అయింది. దీంతో వారిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇదిలా ఉంటే వీరిలో ఇంటి పెద్ద కరోనా కారణంగా మృతి చెందాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిశ్చితార్ధం నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఆ వేడుకకు హాజరైన వారికోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.