ఏపీలో తాజాగా 15 పాజిటివ్... కౌంట్ 329..

ఏపీలో తాజాగా 15 పాజిటివ్... కౌంట్ 329..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ పెరిగింది... కాసేపటికి క్రితమే కరోనా బులెటిన్ విడుదల చేసింది సర్కార్.. మరో 15 కొత్త కేసులు పెరిగాయి. దీంతో ప్రస్తుతానికి పాజిటీవ్‌ కేసుల సంఖ్య 329కి చేరింది. ఇందులో మర్కజ్‌తో లింకులున్న కేసులే అధికంగా ఉన్నాయని ఇప్పటికే ప్రకటించింది సర్కార్.. మంగళవారం సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం 9 గంటలకు వరకు నమోదైన కేసుల వివరాలతో ఉదయం 10 గంటలకు బులిటెన్ విడుదల చేశారు. నెల్లూరు  జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదు కాగా.. కృష్ణా జిల్లాలో 6, చిత్తూరులో మూడు కొత్త కేసులు పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు. దీంతో సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 15 కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 329కి చేరింది. ఇక, ఆరుగురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

మరోవైపు జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల సంఖ్య పరిశీలిస్తే.. అనంతపురం 6, చిత్తూరు 20, తూర్పు గోదావరి 11, గుంటూరు 41, కడప 28, కృష్ణా జిల్లా 35, కర్నూలు 74, నెల్లూరు 49, ప్రకాశం జిల్లా 24, విశాఖపట్నం 20, పశ్చిమగోదావరి 21 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.