జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తుల పరారీ...

జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తుల పరారీ...

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి 15 మంది బాల నేరస్తులు తప్పించుకుని పారిపోయిన ఘటన కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి జువైనల్ హోమ్ నుండి వారు తప్పించుకుని వెళ్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. జువైనల్ హోం గోడదూకి పిల్లలు... పక్కనే ఉన్న బస్తీలోకి ప్రవేశించారు. ముగ్గురు బాలలు వీఆర్వోకు చెందిన మోటార్‌ సైకిల్ తీసుకుని పరారయ్యారు. మరికొంతమంది బాల నేరస్తులు కాలినడకనే పరారైనట్టు తెలుస్తోంది. 

కాగా, జువైనల్ హోం నుంచి పిల్లలు పారిపోయినట్టు సిబ్బంది ఉదయం గుర్తించారు. 15 మంది బాలనేరస్తులు పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు... గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాలలు పారిపోయే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఎవరెవరు పారిపోయారన్నవిషయంపై స్పష్టత వచ్చింది. సిటీలోని మిగతా ప్రాంతాల్లోనూ సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి బాలనేరస్తులను త్వరగా పట్టుకుంటామన్నారు పోలీసులు.