రేప‌టి నుంచి ఈ నెల 31 వ‌ర‌కు కంప్లీట్ లాక్‌డౌన్‌.. అక్క‌డికే ప‌రిమితం...

రేప‌టి నుంచి ఈ నెల 31 వ‌ర‌కు కంప్లీట్ లాక్‌డౌన్‌.. అక్క‌డికే ప‌రిమితం...


క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. దేశ‌వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి.. దీనికి ఏ రాష్ట్రం మిన‌హాయింపు కాదు అనే విధంగా ప‌రిస్థితి త‌యారైంది.. అయితే.. కేంద్రం లాక్‌డౌన్‌ను ముగించి.. అన్‌లాక్‌కు వెళ్లిపోయింది.. లాక్‌డౌన్‌పై నిర్ణ‌యాల‌ను ఆయా రాష్ట్రాల‌కు వ‌దిలేసింది.. ఈ నేప‌థ్యంలో వివిధ రాష్ట్రాలు క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నాయి.. కేసుల తీవ్ర‌ను బ‌ట్టి ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి.. అయితే.. తాజాగా ఒడిశా ప్ర‌భుత్వం..  మ‌రో 14 రోజుల‌పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను విధించాల‌ని నిర్ణ‌యించింది.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ కాకుండా.. క‌రోనా కేసులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మాత్ర‌మే అమ‌లు చేసేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రేపు (జూలై 17వ తేదీ) రాత్రి 9 గంట‌ల నుంచి ఈ నెల 31వ తేదీ అర్ధారాత్రి వ‌ర‌కు.. గంజామ్‌, ఖోర్ధా, క‌ట‌క్‌, జాజ్‌పూర్ జిల్లాల‌తోపాటు రూర్కెలా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో.. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది ఒడిశా స‌ర్కార్..