అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న 120 మంది ప్రయాణికులు..

అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న 120 మంది ప్రయాణికులు..

ఆపరేషన్ వందే భారత్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి భారత్‌కు రప్పించే కార్యక్రమం చురుకుగా సాగుతోంది.. ఇప్పటికే పలు దేశాల నుంచి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఇక, కాసేపటి క్రితమే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది ప్రత్యేక విమానం.. ఈ విమానంలో అమెరికా నుంచి వయ ముంబై మీదుగా హైదరాబాద్‌ చేరుకున్నారు 120 మంది ప్రయాణికులు.. ఇమ్మిగ్రేషన్, పర్సనల్‌ చెకింగ్ ఆ తర్వాత థర్మల్ స్క్రీనింగ్ పూర్తి చేసి.. అక్కడి నుంచి వారిని పెయిడ్ క్వారంటైన్‌కు తరలించనున్నారు అధికారులు. దీనికోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. కాగా, పెయిడ్ క్వారంటైన్‌ కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు హోటళ్లను తెలంగాణ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చినవారిని ఈ పెయిడ్ క్వారంటైన్‌లో పెట్టి.. వాళ్లకు కావాల్సినవి సమకూరుస్తారు.. క్వారంటైన్‌ సమయం ముగిసిన తర్వాత.. కరోనా పరీక్షలు చేసిన తర్వాతే.. ఇళ్లకు పంపించనున్నారు.