ఉన్నావ్‌లో మరో దారుణం... మూడో క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై...

ఉన్నావ్‌లో మరో దారుణం... మూడో క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై...

ఉన్నావ్ అంటే తెలియనివారు ఉండరేమో.. ఉత్తరప్రదేశ్‌ లోని ఉన్నావ్ ప్రాంతం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటింది.. ముఖ్యంగా గతేడాది ఏడాదిలో అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా అడ్డగించిన నిందితులు... ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన సంచలన రేపింది... తాజాగా ఉన్నావ్‌లో మరో ఘటన జరిగింది.. ఈ సారి బాధితురాలు... మూడో తరగతి చదువుతోన్న 12 ఏళ్ల బాలిక.. హోలీ రోజు.. ఇంటి బయట హోలీ వేడుకలు చూస్తోన్న బాలికను.. ఓ యువకుడు రమ్మని సైగ చేయగా... అభంశుభం తెలియని ఆ బాలిక.. అతని దగ్గకు వెళ్లింది.. ఆ తర్వాత మాయమాటలు చెప్పి.. పంట పొలాల్లోకి తీసుకెళ్లిన ఆ దుమ్మార్గుడు.. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని.. బాలిక గొంతు నులిమాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో బాలికి చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రరక్తస్రవం అయిన బాలికను గమనించిన స్థానికులు.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. ఇక, కుటుంబసభ్యుల ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.