ఒమ‌న్‌లో తుపాను బీభ‌త్సం

ఒమ‌న్‌లో తుపాను బీభ‌త్సం

ఒమ‌న్, యెమన్ దేశాల‌లో మెకును తుపాను బీభ‌త్సం సృష్టిస్తోంది. వాగులు, వంక‌లు పొంగి పొర్ల‌డంతో పాటు నీరు ప‌ట్ట‌ణాల్లోకి వ‌చ్చేయ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది చనిపోయిన‌ట్లు ఏఎఫ్‌పీ వార్త సంస్థ పేర్కొంది. వీరిలో ముగ్గురు భార‌తీయులు కూడా ఉన్నారు. సొక‌త్ర వ‌ద్ద గురువారం గంట‌ల‌కు 170 కి.మీ.తో తుపాను తీరం తాకింది. ఆ త‌ర‌వాత విల‌య బీభ‌త్సం సృష్టించింది. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు నీరు న‌గ‌రాల్లోకి వ‌చ్చేస్తున్నాయి. రోడ్ల‌పై ఎక్క‌డిక‌క్క‌డే వాహ‌నాలు నిలిచిపోగా.. కొన్ని నీటిలో మునిగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.