టెక్ దిగ్గ‌జం ఆపిల్ కీల‌క నిర్ణ‌యం

టెక్ దిగ్గ‌జం ఆపిల్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనావైర‌స్‌తో ప్ర‌పంచ‌దేశాలు వ‌ణికిపోతున్నాయి.. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా త‌యారైంది.. అత్య‌ధిక కేసుల‌తో అగ్ర‌రాజ్యం క‌రోనా కేసుల్లో మొద‌టి స్థానంలో ఉంది.. ఇక్కడ ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఫ్లోరిడా, అరిజోనా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ప్రాంతాల్లోని 11 స్టోర్లను మూసేయాలని టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ నిర్ణయించింది. మార్చి నెలలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ స్టోర్లన్నీ మూతపడ్డాయి. ఇటీవలే సేఫ్టీ గైడ్‌లైన్స్ పాటిస్తూ వీటిని ఓపెన్ చేశారు. అయితే అమెరికాలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో 11 స్టోర్లను మూసేస్తున్నట్లు ప్రకటించింది ఈ టెక్ దిగ్గ‌జం. అయితే.. ఈ మూసివేత తాత్కాలిక‌మే.. ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి చేరుకున్నాక‌.. మ‌ళ్లీ ఆయా స్టోర్లు తెరుచుకోనున్నాయి.