కోవిడ్ ఐసోలేషన్ వార్డు నుంచి పది మంది పరార్...

కోవిడ్ ఐసోలేషన్ వార్డు నుంచి పది మంది పరార్...

ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేగింది. రిమ్స్ కోవిడ్, ఐసోలేషన్ వార్డులనుంచి పదిమంది పరారయిన ఘటన కలకలం రేపుతోంది. అందుతున్న వివరాల ప్రకారం రిమ్స్ కోవిడ్ వార్డు నుంచి ముగ్గురు కరోనా పేషంట్లు, ఐసోలేషన్ వార్డు నుంచి ఏడుగురు పరారయ్యారు. ఈ ఏడుగురి రిపోర్ట్లు ఇంకా రావాల్సి ఉంది. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్‌ల కళ్లుగప్పి ఇంత మంది ఎలా పారిపోయారా ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆసుపత్రి సిబ్బంది . వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా ఈ పది మంది కోసం వెతకడం మొదలు పెట్టారు.