ఉదయం బీజేపీలో.. సాయంత్రం కాంగ్రెస్‌లో..

ఉదయం బీజేపీలో.. సాయంత్రం కాంగ్రెస్‌లో..

విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు స్వతంత్ర అభ్యర్థులకు ఎర వేస్తోంది. ఇలా.. ఓ ఎమ్మెల్యే బీజేపీకి చిక్కినట్టే చిక్కి.. చేజారిపోయారు. నిన్న ఉదయం బీజేపీ పంచన చేరిన ఆర్‌.శంకర్‌ అనే ఎమ్మెల్యే సాయంత్రానికి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్యకు అనుచురడైన శంకర్‌.. ఎన్నికల్లో రణబన్నూరు టికెట్‌ ఆశించారు. కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో తమ పార్టీ తరఫున పోటీ చేయాలని బీజేపీ ఆఫర్‌ ఇచ్చినా.. కాదని ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి గెలుపోందారు. బుధవారం ఉదయం బీజేపీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్న శంకర్‌.. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌కు జై కొట్టారు.