తెలంగాణ రాష్ట్రంలో వీటికి అనుమతి లేదు...!

తెలంగాణ రాష్ట్రంలో వీటికి అనుమతి లేదు...!

మే 31 వరకు తెలంగాణలో లాక్ డౌన్ కంటిన్యూ అవుతుందని ప్రకటించారు సీఎం కేసీఆర్. కంటైన్‌ మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే లాక్‌ డౌన్‌ 4.0 సడలింపులు ఇస్తున్నా..రాష్ట్రంలో వీటికి మాత్రం అనుమతులు ఇవ్వబోమన సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు మే 31 వరకు తెరిచేందుకు అనుమతి లేదు. సినిమాథియేటర్లు, షాపింగ్ మాల్స్ ,పంక్షన్‌ హాల్స్‌కు కూడా అనుమతి లేదు. బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు,క్లబ్‌ లు, జిమ్‌లు, పార్కులు,మెట్రో రైలు సర్వీసులు,అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మరి కొన్నాళ్ళు బ్రేక్ తప్పదు.