కన్నేసిన కెమెరా.... కాలిపోయింది

కన్నేసిన కెమెరా.... కాలిపోయింది

వామ్మో... చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచే... దృష్యం... ఒకటి చేద్దామనుకుంటే మరొకటైంది. నిప్పులు కక్కుతూ నింకగిలోకి వెళ్లే రాకెట్ ప్రయోగాన్ని ఎలాగైనా తన కెమెరాలో బంధించాలని కలలుగన్న ఫోటోగ్రాఫర్ కు ఆశాభంగమే కలిగింది. అంతేకాదు ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా బెంబేలెత్తారు. అసలు విషయానికొస్తే.... బిల్ ఇంగల్స్‌ నాసా ఫోటోగ్రాఫర్....  స్పెస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని తన కెమెరాలో బందించాలని ఆశపడ్డారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. 

రాకెట్ నింగికెగిసే సమయం రానే వచ్చింది. రాకెట్ లాంచ్ అవుతున్న వేళ.. ఫోటోలను చిత్రించేందుకు రిమోట్ కంట్రోల్ కెమెరాను ఆన్ చేసి రెడీగా ఉంచారు. అయితే రాకెట్‌ భారీ ఎత్తున నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకుపోతోంది. కెమెరా ఫోటోలు చిత్రిస్తుందని ఫోటో గ్రాఫర్ భావించేలోగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. నిప్పులు కక్కుతూ నింగిలోకి వెళుతున్న రాకెట్ నుంచి వెలువడిన మంటల ధాటికి.. పక్కనే ఏర్పాటుచేసిన రిమోట్ కెమెరా టోస్టీ మాడిపోయింది. కెమెరా మొత్తం కాలి ముద్ద అయింది.  దీంతో బిల్ ఇంగల్స్‌కు ఆశాభంగమే ఎదురైంది. కాని అప్పటి వరకు రికార్డయిన దృశ్యాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. కెమేరా రాకెట్ కు మరీ దగ్గరగా ఉండటంతో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. 

ఈ ఘటనను చూసి వారంతా అవాక్కయ్యారు. భయంతో వణికి పోయారు. దీనికి సంబంధించిన ఫోటోను ఇంగల్స్ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌ కు.....  తమ కళ్లముందున్న దృశ్యాలను ఎప్పటికప్పుడు భూమ్మీదకు పంపే సదుపాయం ఉంది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ మరో రెండు సాటిలైట్స్ ను క్యాలిఫోర్నియా వ్యాండన్ బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి పంపారు.