మతంపేరుతో ఓట్లా.. ప్రకాష్ రాజ్

మతంపేరుతో ఓట్లా.. ప్రకాష్ రాజ్

సమాజాన్ని ప్రభావితం చేసే రంగాల్లో ఒకటి సినిమా రంగం. సినిమా రంగంలో ఉండే వ్యక్తులు ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం గాని, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గాని చేస్తే.. దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. చాలా మంది దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అనడంలో సందేహం లేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్స్ లో ప్రకాష్ రాజ్ ఒకరు. ఇటీవలే ప్రకాష్ రాజ్ ఓ వీడియో ను పోస్ట్ చేశారు.

దేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. దేశంలో హిందుత్వ వాదం బలపడాలంటే.. హిందువులు తలెత్తుకొని గౌరవంగా తిరగాలంటే.. కర్ణాటకలో బీజేపి ని గెలిపించాలని బీజేపి అభ్యర్థుల సతీమణులు ఓటర్లను వేడుకొంటున్నారు. దక్షిణ మంగళూరు బీజేపి అభ్యర్థి వేదవ్యాస్ కామత్ర భార్య గ్రామాల్లో పర్యటిస్తూ ఇలా వినూత్నమైన ప్రచారం చేస్తున్నది. సబ్కా సాత్ .. సబ్కా వికాస్ అంటే ఇలా హిందుత్వ వాదాన్ని బలపరచడమేనా అని సోషల్ మీడియా సాక్షిగా ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నారు.