ఆంధ్రప్రదేశ్‌

మెకపాటి రాజమొహన్ రెడ్ది
మెకపాటి రాజమొహన్ రెడ్ది

జీఎంఆర్ గ్రూప్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కౌన్సిల్ అవార్డు లభించింది. దీంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా విశిష్టమైన ఖ్యాతి గడించింది. 2017 సంవత్సరానికి నిర్వహించిన ఏఎస్‌క్యూ(ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ) పాసింజర్స్ సర్వేలో హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 50 లక్షల నుంచి 1.5 కోట్ల ప్రయాణికుల రవాణా కేటగిరీలో హైదరాబాద్ విమానాశ్రయానికి అగ్రస్థానం లభించిందని మాంట్రియల్‌కు చెందిన ఏసీఐ ప్రకటించింది.ప్రయాణికులకు అందుతున్న సేవలపై స్వయంగా వారి అభిప్రాయాలు సేకరించి.. వాటి ఆధారంగానే హైదరాబాద్ విమానాశ్రయానికి ఈ గుర్తింపును ఇచ్చినట్లు ఏసీఐ తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయానికి గత పదేండ్లలో ఈ గుర్తింపు లభించడం ఇది నాలుగవ సారి. ఏఎస్‌క్యూ అవార్డును పొందడం పట్ల జీఎంఆర్ గ్రూపు చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల హర్షం వ్యక్తం చేశారు. అందరి సమష్టి కృషితోనే విమానాశ్రయానికి ఈ అవార్డు లభించిందని అన్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ అగ్రస్థానంలో నిలవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నామని జీహెచ్‌ఐఏఎల్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ తెలిపారు.

Activities are not Found
No results found.