తెలంగాణ - CLICK HERE

మలక్‌పేట
మలక్‌పేట

మలక్ పేట

నియోజకవర్గాల పునర్విభజనతో మలక్ పేట నియోజకవర్గంలో ఎంఐఎం హవా కొనసాగుతోంది. ఆ పార్టీ తరుపున పోటీ చేసిని అహ్మద్ బిన్ అబ్ధుల్ బలాల రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో సమీప బిజెపి అభ్యర్ధి వి.వెంకటరెడ్డిని 23,263 ఓట్ల తేడాతో ఓడించారు. మలక్ పేట నియోజకవర్గంలో గతంలో మీర్ అహ్మద్ ఖాన్ రెండుసార్లు, జి.సరోజని పుల్లారెడ్డి రెండుసార్లు, ఎన్.ఇంద్రసేనా రెడ్డి మూడుసార్లు, మల్ రెడ్డి రంగారెడ్డి రెండు సార్లు గెల్చారు. సరోజని పుల్లారెడ్డి, మీర్ అహ్మద్ అలీఖాన్, కె.ప్రభాకర్ రెడ్డిలు మంత్రి పదవి నిర్వహించిన వారిలో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి.. జనతా పార్టీ తరపున గెల్చి అనంతరం కాంగ్రెస్ లో చేరారు. మలక్ పేటలో ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు  జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐలు కలిసి ఆరుసార్లు,  బిజెపి మూడుసార్లు , మజ్లీస్ రెండుసార్లు, పిడిఎఫ్,  జనతా, టిడిపిలు ఒక్కోసారి విజయం సాధించాయి. 

మలక్ పేట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్ బలాలను మరోసారి రంగంలోకి దింపింది ఎంఐఎం

Activities are not Found
No results found.